చంద్రబాబు..లోకేష్ ల అవినీతిపై పిటీషన్ ఉపసంహరణ
BY Telugu Gateway26 Sept 2018 11:58 AM IST

X
Telugu Gateway26 Sept 2018 11:58 AM IST
ఏపీలో ఐటి కంపెనీలకు భూముల కేటాయింపులు..రాయితీల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన మాజీ జడ్జి శ్రావణ్ కుమార్ తన పిటీషన్ ను ఉపసంహరించుకున్నారు. ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడగా..మరిన్ని వివరాలతో మళ్లీ కోర్టు ముందుకు వస్తానని తన పిటీషన్ ఉపసంహరించుకున్నారు.
మరోసారి పూర్తి ఆధారాలతో రావాలని పిటీషనర్ ను సూచించిన హైకోర్టు. ఆర్ టిఐ కింద దరఖాస్తు చేసినా కూడా ప్రభుత్వ నుంచి సరైన సమాధానం రావటంలేదని పిటీషనర్ ఆరోపించారు. మరోసారి పూర్తి ఆధారాలతో వస్తామని పిటీషన్ ను ఉపసంహరించుకున్నారు.
Next Story



