చంద్రబాబు.. నారాయణ..గంటాలది దోపిడీ కులమే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజికపరంగా సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులది వేర్వేరు కులాలు కావచ్చు కానీ...వాళ్లందరిదీ దోపిడీ కులమే అని వ్యాఖ్యానించారు. నెల్లూరులో కాలేజీలో పనిచేసిన నారాయణ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని శాసించే స్థాయికి చేరుకున్నారని వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థ ఎంత శక్తివంతమైనదో ఈ విషయం తెలియజేస్తున్నదని తెలిపారు. టీడీపీని నారాయణ విద్యా సంస్థలే పోషిస్తున్నాయని పేర్కొన్నారు. నారాయణ ఓ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి చేరటం అంటే విద్యా వ్యవస్థ ఎంత బలమైన వ్యాపారంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తనకు తెలిసి ప్రపంచంలో రెండే రెండు కులాలు ఉన్నాయి. అది ఒకటి దోపిడీకులం..రెండవది దోపిడీకి గురయ్యే కులం అని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ మాస్ లీడర్ గా పార్టీ పెట్టారని..పార్టీ పెట్టడానికి మాస్ లీడర్ ఇమేజ్ ఒక్కటే సరిపోదని అన్నారు. తొలి సారి తొమ్మిది నెలల్లోనే పదవి కోల్పోయారని..తర్వాత సొంత మనుషుల చేతిలోనే పదవీచ్యుడుతు అయి..ప్రాణం కోల్పోలవలసి వచ్చిందని తెలిపారు. విద్యా వ్యవస్థ వ్యాపారంగా మారి నిర్వీర్యం అయిపోయిందని అన్నారు. పవన్ కల్యా|ణ్ వివిధ జిల్లాల నుంచి టీచర్లతో సమావేశం అయ్యారు. పాఠాలు చెప్పే విద్యార్ధులకు పిల్లలను తీసుకువచ్చే టార్గెట్లు పెట్టడం ఏంటి అని నిలదీశారు.