Top
Telugu Gateway

కెసీఆర్ కాళ్ళుపట్టుకుంటేనే డీఎస్ కు రాజ్యసభ

కెసీఆర్ కాళ్ళుపట్టుకుంటేనే డీఎస్ కు రాజ్యసభ
X

నిజామాబాద్ లో టీఆర్ఎస్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఆ పార్టీ ఎంపీ డీ ఎస్ శ్రీనివాస్ చేతనైతే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. తాను పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తేలేదని అన్నారు. ఆయన పలు అంశాలపై సుదీర్ఘ లేఖ కూడా విడుదల చేశారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ కూడా అంతే ఘాటుగా స్పందించింది. కెసీఆర్ కాళ్ళు పట్టుకుంటేనే ఆయనకు రాజ్యసభ సీటు వచ్చిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. డీఎస్ కు ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ కవితను తన కొడుకు విమర్శించినప్పుడు ఎందుకు డీఎస్ స్పందించలేదని బాజిరెడ్డి ప్రశ్నించారు. డీఎస్ ఓ చీడపురుగు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నీ గురించి..నీ కొడుకు గురించి జిల్లా ప్రజలకు తెలుసు’ అని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు డీఎస్ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

Next Story
Share it