Top
Telugu Gateway

నాగశౌర్యకు ‘నర్తనశాల’ షాక్ లు!

నాగశౌర్యకు ‘నర్తనశాల’ షాక్ లు!
X

నాగశౌర్య ‘ఛలో’ సినిమాతో ట్రాక్ లో పడ్డాడు. కణం కూడా ఓకే అన్పించింది. కానీ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన తాజా సినిమా ‘నర్తనశాల’ నాగశౌర్యకు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. నర్తనశాల సినిమాకు ముందు చాలా మంది నిర్మాతలు కొత్త కథలతో నాగశౌర్యను సంప్రదించారు. అయితే ఏది అయినా కూడా నర్తనశాల సినిమా తర్వాతే మాట్లాడదాం అంటూ వారందరిని వెనక్కి పంపించేశారు. దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం నాగశౌర్య రెమ్యునరేషన్ కోటి నుంచి కోటిన్నర మధ్య ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నర్తనశాల తర్వాత తాను ఐదు కోట్ల రూపాయల క్లబ్ లో చేరతానని భావించిన నాగశౌర్య తనకు వద్దకు వచ్చిన కొత్త ప్రతిపాదనలను అంగీకరించలేదు. అవి ఒప్పుకుని అడ్వాన్స్ లు తీసుకుని ఉన్నా..నర్తనశాల పలితంతో సంబంధం లేకుండా ఈ హీరోతో సినిమాలు చేయాల్సి వచ్చేది నిర్మాతలు. కానీ అందివచ్చిన అవకాశాలను కాలదన్నుకున్నారు ఈ కుర్ర హీరో. కానీ నర్తనశాల రషెస్ చూసిన తర్వాత నాగశౌర్యకు అసలు విషయం అర్థం అయింది. అందుకే అంతకు ముందు తన వద్దకు వచ్చిన నిర్మాతలకు కబురు పంపారు.

ఇంత కాలం వద్దని ఇప్పుడు తనంతట తానుగా ఎందుకు కబురు చేస్తున్నారో అన్న అనుమానం ఆ నిర్మాతలకూ వచ్చింది. నర్తనశాల విడుదల అయిన రోజే అడ్వాన్స్ లు ఇస్తాం..ఇప్పుడు మంచి రోజులు లేవని తప్పించుకున్నారు. కానీ ‘నర్తనశాల’ సినిమా షాక్ ఇచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఇది డిజాస్టర్ గా నిలిచింది. ఛలో సినిమాతో వచ్చిన ఇమేజ్ కాస్తా ఈ సినిమాతో ఫట్ మని పోయింది. వచ్చిన సినిమాలు అంగీకరించకుండా అతి విశ్వాసంతో అన్ని రకాలుగా దెబ్బతినాల్సి వచ్చిందని ఇప్పుడు నాగౌశర్య లబోదిబోమనాల్సి వస్తోంది. మళ్ళీ సొంత బ్యానర్ లో చేసి..ఓ హిట్ కొట్టే వరకూ కొత్త నిర్మాత ఎవరైనా వస్తారో లేదో వేచిచూడాల్సిందే.

Next Story
Share it