Telugu Gateway
Telangana

బొంతు అసమ్మతి వెనక కెటీఆర్!

బొంతు అసమ్మతి వెనక కెటీఆర్!
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఒక్కసారే 105 మంది టిక్కెట్లు ప్రకటించటం వెనక రాజకీయ వ్యూహాం కంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?. అంటే అవుననే చెబతున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. వచ్చే ఎన్నికల్లో తనకంటూ ప్రత్యేకంగా ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకునేందుకు టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ తనయుడు కెటీఆర్ ప్రయత్నాలు చేశారంటున్నారు. ఎన్నికల వేళ పార్టీలో ఇది పెద్ద దుమారానికి కారణం అయ్యే అవకాశం ఉందని గ్రహించిన కెసీఆర్ దీనికి ఆదిలోనే అడ్డుకట్ట వేయటానికి ఈ స్కెచ్ వేశారని చెబుతున్నారు. కొంగరకలాన్ సభ సమయంలోనే టిక్కెట్ల కేటాయింపు అంశంపై కెసీఆర్, కెటీఆర్ ల మధ్య విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాల్లో బాగా ప్రచారం జరిగింది. సర్వే నివేదికలు ప్రతికూలంగా ఉన్న చాలా మంది సిట్టింగ్ లకు సీట్లు ఖరారు చేయటం వెనకే ఇదే కారణం అని చెబుతున్నారు. సహజంగా టీఆర్ఎస్ అధినేత తీరు తెలిసిన వారెవరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తితే ఇక అంతే. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో. కానీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తనకు ఉప్పల్ టిక్కెట్ కేటాయించలేదని అలక వహించి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఆయన అనుచరులు సమావేశాలు నిర్వహించారు.

బొంతు రామ్మోహన్ కొన్ని రోజులు బెంగుళూరులో మకాం వేసి వచ్చారు. సహజంగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసే వారిని కెసీఆర్ కానీ..కెటీఆర్ ఏ మాత్రం దగ్గరకు రానివ్వరు. కానీ అందుకు భిన్నంగా టిక్కెట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలసి మంత్రి కెటీఆర్ ఎంపీ మల్లారెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనటం విశేషం. ఇది టీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బొంతు రామ్మోహన్ అండగా కెటీఆర్ ఉన్నారని..త్వరలోనే ఉప్పల్ టిక్కెట్ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంటే కెసీఆర్ ప్రకటించిన టిక్కెట్ ను కెటీఆర్ మార్పిస్తారా?. చూడాలి ఈ అసంతృప్తుల రాజకీయం ఎటువైపు మళ్ళుతుందో?. ముందు టిక్కెట్ల కేటాయింపు చేయటం వల్ల అసంతృప్త నేతలు హాయిగా చర్చలు జరిపి టిక్కెట్లు దక్కే పార్టీలోకి వెళ్ళేందుకు మార్గం సుగమం అయిందని చెబుతున్నారు.

Next Story
Share it