Telugu Gateway
Telangana

కెసీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

కెసీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కు బాగా పట్టున్న ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ ప్రస్తుతం ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పలువురిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఇది తెలియదని ఎవరైనా అనుకుంటారా?. అంటే నో ఛాన్స్ అనే చెప్పొచ్చు. మరి సిట్టింగ్ లు అందరికీ ఇంచుమించు సీట్లు ఎందుకు ఇచ్చారు?. ప్రజల్లో వ్యతిరేకత పేరుతో సిట్టింగ్ లకు భారీ ఎత్తున సీట్లలో కోత విధిస్తే రాజకీయంగా జరిగే పరిణామాలు ఊహించి కెసీఆర్ ప్లాన్ ను మార్చినట్లు చెబుతున్నారు. కేవలం తనను చూసి ఓటు వేయాలని కోరటం ద్వారా ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను అధిగమించాలనేది ఆయన ప్లాన్. అలా కాకుండా సిట్టింగ్ లకు సీట్లు కోత పెడితే గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వంలో సాగిన అక్రమాలు, కనీసం తమకు నోరెత్తే ఛాన్స్ రాలేదనే విషయం, సీఎం కెసీఆర్ కాదు కదా..కనీసం కెటీఆర్ కూడా అందుబాటులో ఉండరనే విషయాలను ప్రజల్లో ప్రస్తావిస్తే అది అసలుకే మోసం తెస్తుందనేది కెసీఆర్ భయంగా చెబుతున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెప్పే మాటలకు కాస్త విలువ ఎక్కువ ఉంటుంది. సీటు రాలేదనే విమర్శలు చేస్తున్నారనే దానికి ఛాన్స్ ఉన్నా...ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను వారు బహిరంగంగా చెపితే అవి మరింత ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సీఎం కెసీఆర్ సిట్టింగ్ లు అందరికీ సీట్లు ఇవ్వటం ద్వారా చాలా పెద్ద రిస్క్ చేశారనే చెప్పొచ్చు. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో వేచిచూడాల్సిందే. సిట్టింగ్ లందరికీ సీట్లు చూసిన తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్ లో ఒకింత జోష్ పెరిగిందనే చెప్పొచ్చు. స్థానిక పరిస్థితులపై అంచనాలతోనే ఆ పార్టీ నేతలు కుషీకుషీగా ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా టీఆర్ఎఎస్ లో అసంతృప్తి వ్యవహారాలు బయటకు వస్తూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ జాతకాన్ని నిర్దేశించేది కూడా ఎక్కువ శాతం సిట్టింగ్ సీట్లే కానున్నాయి?. మరి ఫలితాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it