Telugu Gateway
Telangana

కెటీఆర్ కు మరింత డ్యామేజ్ చేసిన కెసీఆర్!

కెటీఆర్ కు మరింత డ్యామేజ్ చేసిన కెసీఆర్!
X

మంత్రి కెటీఆర్ ఇమేజ్ ను సీఎం కెసీఆరే డ్యామేజ్ చేశారా?. అంటే అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. కొంగరకలాన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభ కీలక బాధ్యతలు కెటీఆర్ కే కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ సభ కాస్తా అనుకున్నంత సక్సెస్ కాకపోవటంతో విపక్షాలు ఎటాక్ ప్రారంభించాయి. ప్రజల్లో కూడా ఓ తరహా చర్చ ప్రారంభం అయింది. ఈ తరుణంలో మళ్లీ వెంటనే సీఎం కెసీఆర్ సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ‘ఆశీర్వాద సభ’ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సభ బాధ్యతను మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు అప్పగించారు. కొంగరకలాన్ వంటి పెద్ద సభ బాధ్యతల్లో కనీసం ఎలాంటి పని అప్పగించని కెసీఆర్ సడన్ గా మళ్ళీ ఈ నిర్ణయం తీసుకోవటం వెనక కారణమేంటి?. ఇది పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పార్టీ నిర్మాణంలో ఎంతో కీలకంగా ఉన్న హరీష్ రావు కూడా టీఆర్ఎస్ అధినేత వైఖరిపై అసంతృప్తితో ఉన్నా అది ఎక్కడా బహిర్గతం చేయకుండా నెట్టుకొస్తున్నారు.

గత కొంత కాలంగా హరీష్ రావును పక్కన పెట్టేసిన కెసీఆర్ ప్రభుత్వంలోనూ...పార్టీలోనూ పూర్తిగా కెటీఆర్ మాటే చెల్లుబాటు అయ్యేలా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రగతి నివేదన సభ ఫెయిల్యూర్ అంశం ఎక్కువ రోజులు ప్రజల్లో నానకుండా ఉండేందుకే తక్షణం హుస్నాబాద్ సభ తలపెట్టారని..లేకపోతే ఇంత వేగంగా మరో బహిరంగ సభ మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఏముందనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ప్రగతి నివేదన సభలో పోయిన పరువును హుస్నాబాద్ సభతో దక్కించుకునే యోచనలో ఉన్నారు టీఆర్ఎస్ పెద్దలు. ఈ సభ హిట్ అయి..కెసీఆర్ పాత పంచ్ లతో చెలరేగిపోతే..అది సహజంగానే చర్చనీయాంశం అవుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో కెటీఆర్ పరువును కెసీఆరే తీసేసినట్లు అయిందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it