Telugu Gateway
Telangana

కెసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఒకేసారి 105 మంది అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌

కెసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఒకేసారి 105 మంది అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌
X

తెలంగాణ రాజ‌కీయాల్లో గురువారం నాడు ప‌లు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రివ‌ర్గ స‌మావేశం..అసెంబ్లీ ర‌ద్దు..ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా కెసీఆర్ కు బాధ్య‌త‌లు అప్ప‌గింత‌..వెంట‌నే గెజిట్ నోటిఫికేష‌న్ లు వెలువ‌డ్డాయి. అంతే కాదు..రాజ‌కీయంగా కూడా కెసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఒకేసారి 105 మంది అభ్య‌ర్ధుల పేర్ల‌ను ప్ర‌క‌టించారు. ఇది తెలంగాణ రాజ‌కీయాల్లో పెద్ద సంచ‌ల‌నంగా మారింది. అయితే ఈ అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌పై టీఆర్ఎస్ వ‌ర్గాల నుంచే మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్తం అవుతోంది. ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త తెచ్చుకున్న వారికి కూడా టిక్కెట్లు ఇచ్చార‌ని..ఇది ప్ర‌తికూల ఫ‌లితాల‌కు దారి తీయ‌వ‌చ్చ‌నే అంచ‌నాలు వెలువడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాబూమోహన్‌, నల్లాల ఓదేలుకు మెండి చేయిచూపిన కేసీఆర్‌... పార్టీ మారిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్‌ ఖరారు చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై కాంగ్రెస్ పార్టీ హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది. ఈ జాబితా చూసిన త‌ర్వాత త‌మ గెలుపు మ‌రింత సుల‌భం అయింద‌ని భావిస్తున్న‌ట్లు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లాల వారీగా కెసీఆర్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్ధుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం:

1) భద్రాచలం : డా: తెల్లం వెంకట రావ్‌

2) పినపాక : పాయమ్‌ వెంకటేశ్వర్లు

3) అశ్వారావు పేట : తాటి వెంకటేశ్వర్లు

4) ఇల్లెందు : కోరమ్‌ వెంకయ్య

5) కొత్తగూడెం : జలగం వెంకట్‌ రావు

ఖమ్మం :

6) ఖమ్మం​: పువ్వాడ అజయ్‌ కుమార్‌

7) పాలేరు : తుమ్మల నాగేశ్వర్‌ రావు

8) వైరా : బానోత్‌ మదన్‌ లాల్‌

9)మధిర : లింగాల కమల్‌రాజ్‌

10) సత్తుపల్లి : పిడమర్తి రవి

మహబూబాబాద్‌ :

11) మహబూబాబాద్‌ : బానోత్‌ శంకర్‌ నాయక్‌

12) దోర్నకల్‌ : డీఎస్‌ రెడ్య నాయక్‌

వరంగల్‌ (రూరల్‌) :

13) పరకాల : చల్లా ధర్మా రెడ్డి

14) నర్సంపేట్‌ : పెద్ది సుదర్శన్‌ రెడ్డి

15) వర్థన్నపేట : అరూరి రమేష్‌

వరంగల్‌ ( అర్బన్‌) :

16) వరంగల్‌ వెస్ట్‌ : దాస్యం వినయ్‌ భాస్యర్‌

జయశంకర్‌ భూపాలపల్లి :

17) భూపాలపల్లి : ఎస్‌. మధుసూదనాచారి

18) ములుగు : అజ్మీరా చందులాల్‌

జనగాం :

19) జనగాం : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

20) స్టేషన్‌ ఘన్‌పూర్‌ : డా. తాటికొండ రాజయ్య

21) పాలకుర్తి : ఎర్రబెల్లి దయాకర్‌ రావ్‌

నల్గొండ :

22) నల్గొండ : కంచర్ల భూపాల్‌ రెడ్డి

23) మిర్యాలగూడ : ఎన్‌. భాస్యర్‌ రావ్‌

24) నాగార్జున సాగర్‌ : నోముల నర్సింమయ్య

25) దేవరకొండ : రమావత్‌ రవీంద్ర కుమార్‌

26) మునుగోడు : కుసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి

27)నక్రేకల్‌ : వేముల వీరేశం

సూర్యాపేట్‌ :

28) సూర్యాపేట్‌ : గుంతకండ్ల జగదీష్‌ రెడ్డి

29) తుంగతుర్తి : గ్యాదారి కిషోర్‌ కుమార్‌

యాదాద్రి భువనగిరి :

30) ఆలేరు : గొంగిడి సునీత

31) భువనగిరి : పైల్ల శేఖర్‌ రెడ్డి

నిజామాబాద్‌ :

32) నిజామాబాద్‌ అర్బన్‌ : గణేష్‌ బీగాల

33) నిజామాబాద్‌ రూరల్‌ : బాజిరెడ్డి గోవర్థన్‌

34) ఆర్మూర్‌ : ఆశాన్నగరి జీవన్‌ రెడ్డి

35) బాల్కొండ : వేముల ప్రశాంత్‌ రెడ్డి

36) బోదన్‌ : షకీల్‌ అహ్మద్‌

కామారెడ్డి :

37) బాన్స్‌వాడా : పోచారం శ్రీనివాస రెడ్డి

38) కామారెడ్డి : గంప గోవర్థన్‌

39) జుక్కల్‌ : హనుమంతు షిండే

40) యాల్లారెడ్డి : ఏనుగు రవీందర్‌ రెడ్డి

అదిలాబాద్‌ :

41) అదిలాబాద్‌ : జోగు రామన్న

42) బోధ్‌ : రాథోడ్‌ బాబు రావ్‌

43)ఖానాపూర్‌ : రేఖా నాయక్‌

అసిఫాబాద్‌ :

44) అసిఫాబాద్‌ : కోవ లక్ష్మీ

45) సిర్పూర్‌ కాజా నగర్‌ : కోనేరు కోనప్ప

నిర్మల్‌ :

46) నిర్మల్‌ : అల్లోల ఇంద్ర కరణ్‌ రెడ్డి

47) ముధోల్‌ : జి. విట్టల్‌ రెడ్డి

మంచిర్యాల :

48) మంచిర్యాల : నాదిపెల్లి దివాకర్‌ రావ్‌

49) బెల్లంపల్లి : దుర్గం చిన్నయ్య

50 ) చెన్నూర్‌ : బాల్క సుమన్‌

కరీంనగర్‌ :

51) కరీంనగర్‌ : గంగుల కమలాకర్‌

52) హుజూరాబాద్‌ : ఈటెల రాజేందర్‌

53) మనకొండూర్‌ : రసమయి బాలక్రిష్ణ

సిరిసిల్ల :

54) సిరిసిల్ల : కేటీ రామారావ్‌

55) వేములవాడ : చెన్నమనేని రమేష్‌

జగిత్యాల :

56) జగిత్యాల : డా. ఎమ్‌. సంజయ్‌ కుమార్‌

57) కోరుట్ల : కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావ్‌

58) ధర్మపురి : కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి :

59) పెద్దపల్లి : దాసరి మనోహర్‌ రెడ్డి

60) మంతని : పుట్ట మధుకర్‌

61) రామగుండమ్‌ : సోమారపు సత్యనారాయణ

సిద్దిపేట :

62) సిద్దిపేట : హరీశ్‌రావు

63) దుబ్బాక : సోలిపేట రామాలింగారెడ్డి

64) గజ్వేల్ : కేసీఆర్

65) హుస్నాబాద్ : సతీష్‌కుమార్

మెదక్‌ :

66) మెదక్‌ : పద్మాదేవేందర్‌ రెడ్డి

67) నార్సాపూర్‌ : చిలుముల మదన్‌ రెడ్డి

సంగారెడ్డి :

68) సంగారెడ్డి : చింతా ప్రభాకర్

69) నారాయణఖేడ్ : భూపాల్‌‌రెడ్డి

70) ఆందోల్ : చంటి క్రాంతి కిరణ్

71) పటాన్‌చెరు : గూడెం మహిపాల్ రెడ్డి

మహబూబ్‌నగర్‌ :

72) మహబూబ్‌నగర్ : శ్రీనివాస్‌గౌడ్

73) జడ్చెర్ల : లక్ష్మారెడ్డి

74) దేవరకద్ర : ఆలే వెంకటేశ్వర్‌రెడ్డి

75) నారాయణపేట్ : రాజేందర్‌రెడ్డి

76) మక్తల్‌ : చిట్టం రామ్‌ మోహన్‌ రెడ్డి

నాగర్‌కర్నూల్‌ :

77) నాగర్‌‌కర్నూల్ : మర్రి జనార్ధన్‌రెడ్డి

78) కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు

79) అచ్చంపేట : గువ్వల బాలరాజ్

80) కల్వకుర్తి : జి. జైపాల్‌ యాదవ్‌

వనపర్తి :

81) వనపర్తి : సింగి రెడ్డి నిరంజన్‌ రెడ్డి

గద్వాల్‌ :

82) గద్వాల్‌ : బండ్ల క్రిష్ణ మోహన్‌ రెడ్డి

83) ఆలమూర్‌ : వల్లూర్‌ మల్లెపోగు అబ్రహం

వికారాబాద్‌ :

84) పరిగి : కోప్పుల మహేష్‌ రెడ్డి

85) తాండూర్‌ : పట్నం మహేందర్‌ రెడ్డి

86) కొడంగల్‌ : పట్నం నరేందర్‌ రెడ్డి

రంగారెడ్డి :

87) షాద్‌నగర్‌ : అంజయ్య యాదవ్

88) రాజేంద్రనగర్‌ : ప్రకాష్‌ గౌడ్‌

89) మహేశ్వరం : తీగల కృష్ణారెడ్డి

90) ఇబ్రహింపట్నం : మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి

91)శేరిలింగంపల్లి: అరికెపూడి గాంధీ

92) ఎల్బీనగర్‌ : మద్దగోని రామ్మోహన్‌ గౌడ్‌

93) చేవెళ్ల : కాలె యాదయ్య

మల్కాజ్‌గిరి :

94) కుత్బుల్లాపూర్‌: వివేకానంద

95) కూకట్‌పల్లి : మాధవరం కృష్ణారావు

96) ఉప్పల్‌ : సుభాష్‌ రెడ్డి

హైదరాబాద్‌ :

97) సికింద్రాబాద్‌ : పద్మారావు

98) సనత్‌ నగర్‌ : తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

99) కంటోన్మెంట్‌ : సాయన్న

100) జూబ్లీహిల్స్‌ : మాగంటి గోపినాథ్‌

101) యాకత్‌పూరా: సామ సుందర్‌ రెడ్డి

102) చాంద్రాయణగుట్ట : ఎం. సీతారాం రెడ్డి

103) కార్వాన్‌ : జీవన్‌ సింగ్‌

104) బహదూర్‌పురా : ఇయాకత్‌ అలీ

105) నాంపల్లి : మునుకుంట్ల ఆనంద్‌ గౌడ్‌

Next Story
Share it