Telugu Gateway
Cinema

న్యూలుక్ లో తారక్

న్యూలుక్ లో తారక్
X

ఎన్టీఆర్ కొత్త లుక్ ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అరవింద సమేత వీరరాఘవ సినిమాకు సంబంధించిన ఈ లుక్ ను రచయిత రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన రెండవ పాట విడుదల సందర్భంగా ఈ లుక్ కూడా విడుదల చేశారు. అంతే కాదు దీనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను ఈ లుక్ పై ఏమీ మాట్లాడను.దిష్టి తగులుతుందని అని కామెంట్ పెట్టారు. అరవింద సమేత వీరరాఘవ సినిమాలో పూజా హెగ్డెతోపాటు ఈషా రెబ్బ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరాకు సందడి చేయనుంది.

Next Story
Share it