అరవింద సమేత పాట చిత్రీకరణ పూర్తి
ఎన్టీఆర్, పూజా హెగ్డెలు జంటగా నటిస్తున్న అరవింద సమేత రాఘవ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా ముందుకు సాగుతుంది. హరికృష్ణ ఆకస్మిక మరణంతో షూటింగ్ కు మూడు రోజుల పాటు బ్రేక్ వచ్చింది. ఆదివారం నాడు ఎన్టీఆర్ పై ఓ పాత చిత్రీకరణ పూర్తయింది. ఇది చూసిన మ్యూజిక్ డైరక్టర్ తమన్ స్పందిస్తూ ఎన్టీఆర్ లో ఫుల్ ఎనర్జీని చూశా. డ్యాన్స్ లో తనదైన శైలి చూపించారు ఎన్టీఆర్. త్వరలోనే ఆడియోకు సంబంధించిన వివరాలు అందిస్తానని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఇదే. రాయలసీమ కథ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ చిత్తూరు యాసలో మాట్లాడి ప్రేక్షకులను అలరించనున్నారు. జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే. దసరా సందర్భంగా అరవింద సమేత ప్రేక్షకుల ముందుకు రానుంది.