అరవింద సమేత రాఘవ ఆడియో డేట్ వచ్చేసింది
BY Telugu Gateway12 Sept 2018 8:07 PM IST

X
Telugu Gateway12 Sept 2018 8:07 PM IST
జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డెలు జంటగా నటించిన ‘అరవింద సమేత రాఘవ’ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో సెప్టెంబర్ 20 న అట్టహాసంగా ఆవిష్కరించనున్నారు. దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఇదే. సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీ బిజీగా ఉంది. అందులో భాగంగానే ఆడియో ఆల్బమ్‌ను సెప్టెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లుగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అఫీషియల్‌గా ట్విట్టర్లో తెలిపారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
Next Story