Telugu Gateway
Politics

జగనే వైసీపీలో డిక్టేటర్

జగనే వైసీపీలో డిక్టేటర్
X

వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఝలక్. జిల్లా జడ్పీ ఛైర్మన్, వైసీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అదే సమయంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో జగనే డిక్టేకర్ అని ఆరోపించారు. ఏకపక్షంగా వ్యవహరించి వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి తనను తప్పించారని ఆరోపించారు.

వైసీపీ అధిష్టానం ప్రస్తుతం ఈ బాధ్యతను కొత్తగా పార్టీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే ఆయన మనస్థాపంతో పార్టీని వీడారు. ఎన్నికల్లో పోటీకి 50 కోట్ల రూపాయలు కావాలి?. నువ్వు పెట్టగలవా? అని జగన్ అడిగారని బొమ్మిరెడ్డి ఆరోపించారు. తాను ఏ పార్టీలో చేరటం లేదన్నారు.

Next Story
Share it