Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు

రేవంత్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు
X

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటి సోదాలు ముగిశాయి. దాదాపు 48 గంటల పాటు సాగిన ఈ సోదాలు శుక్రవారం అర్థరాత్రి తర్వాత పూర్తయ్యాయి. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిని తమ ముందు అక్టోబర్ 3న హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చి వెళ్ళారు ఐటి అధికారులు. అదే సమయంలో కొన్ని డాక్యుమెంట్లను అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. ఐటి అధికారులు 31గంటల పాటు రేవంత్, అతని భార్య గీతను విచారించారని చెబుతున్నారు. సోదాలు ముగిసిన తరువాత వెళ్లే ముందు డాకుమెంట్స్ పై రేవంత్ అతని భార్య సంతకాలు తీసుకున్నారు.

Next Story
Share it