Telugu Gateway
Offbeat

విమానంలో దోమలు..నష్టపరిహారం

విమానంలో దోమలు..నష్టపరిహారం
X

విమానంలో దోమలు ఏంటి అనుకుంటున్నారా? నిజం. అయితే ఈ దోమలపై వాళ్లు ఏకంగా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరు 40 వేల రూపాయల లెక్కన నష్టపరిహారం కూడా పొందారు. వాళ్లు ముగ్గురూ న్యాయవాదులే. ఢిల్లీ-అమృతసర్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వినియోగదారుల ఫోరం బాధిత ప్రయాణికులకు 40 వేల రూపాయల లెక్కన చెల్లింపులు చేయాలని ఆదేశించింది.

విమానంలో దోమల అంశంపై ప్రయాణికులు ఫిర్యాదు చేయగా..సిబ్బంది మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్నారు. అంతే కాదు ఇది చిన్న విషయం అని కొట్టిపారేశారు. పైగా ఎలాంటి నివారణ చర్యలు కూడా తీసుకోకుండా వదిలేశారు. విమానయాన సంస్థతోపాటు ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియాను కూడా 15 వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సిందిగా ఫోరం ఆదేశించింది.

Next Story
Share it