Telugu Gateway
Politics

జైల్లో ఉన్నా 50వేల మెజారిటీతో గెలుస్తా

జైల్లో ఉన్నా 50వేల మెజారిటీతో గెలుస్తా
X

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఐటి దాడుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడే ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించగా..అదే రోజు రేవంత్ తోపాటు ఆయన బంధువుల ఇళ్ళపై ఐటి దాడులు జరిగాయి. దీంతో ఆయన మహబూబ్ నగర్ జిల్లా కోస్గి సమావేశంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే తన చివరి ప్రచార సభ కావొచ్చని..అయితే జైలులో ఉన్నా నామినేషన్ వేసి..50 వేల మెజారిటీతో గెలుస్తానని పేర్కొన్నారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ను గద్దె దించటమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.

ఎవరెన్ని కుట్రలు చేసిన తన విజయాన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, సీఎం కెసీఆర్ లు కుట్ర పన్ని తనను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి వారం రోజుల క్రితమే మీడియా సమావేశం పెట్టి మరీ వివరించారు. తాజాగా ఐటి, ఈడీ అధికారుల దాడులు జరగటం విశేషం. అయితే ఈ పరిణామాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it