కాలుష్య రహిత ‘హైడ్రోజన్ రైలు’ వచ్చేసింది
ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ప్రపంచంలోనే తొలి ‘హైడ్రోజన్ ఆధారిత రైలు’ వచ్చేసింది. జర్మనీ తొలి సారి ఈ రైలును అందుబాబులోకి తెచ్చింది. ఈ రైలుతో అసలు ఎలాంటి కాలుష్యమే ఉండదు. ఏకబిగిన ఈ రైలు వంద కిలోమీరట్ల మేర ప్రయాణించగలదు. ఫ్రెంచ్ రైలు రవాణా సంస్థ ‘అలోస్థోమ్’ ఈ రైలును నిర్మించింది. ఈ రైలులో ఉండే ఫ్యూయల్ సెల్స్ ప్రయాణానికి అవసరమైన విద్యుత్ ను అందజేస్తాయి. ఒకే హైడ్రోజన్ ట్యాంక్ తో ఈ రైలు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 2021 నాటికి అలోస్థోమ్ కాలుష్య రహిత 14 హైడ్రోజన్ రైళ్ళను అందించే ఏర్పాట్లు చేస్తోంది.
జర్మనీలోని పలు రాష్ట్రాలు కూడా ఈ రైళ్లపై ఆసక్తి చూపుతున్నాయి. ఫ్యూయల్ సెల్స్ హైడ్రోజన్, ఆక్సిజన్ తో ఇంథనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ క్రమంలో కేవలం నీరు, వేడి మాత్రమే బయటకు వస్తుంది. రైలు నిర్వహణకు సరిపోగా..మిగిలిన ఇంథనాన్ని కూడ రైలులో ఉండే లిథియం బ్యాటరీల్ల నిల్వచేసుకునే వెసులుబాటు ఉంటుంది. డీజిల్, విద్యుత్ లకు ప్రత్యామ్నాయంగా మరింత పర్యావరణహిత ఉత్పత్తులపై అలోస్థోమ్ దృష్టి పెట్టింది. భవిష్యత్ లో వీటికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.