Telugu Gateway
Cinema

‘దేవదాస్’ షూటింగ్ పూర్తి

‘దేవదాస్’ షూటింగ్ పూర్తి
X

అక్కినేని నాగార్జున, నానిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘దేవదాస్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని హీరో అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలిపారు. చిత్ర యూనిట్ కు సంబంధించిన సభ్యులతో దిగిన ఆ ఫోటోను ఆయన షేర్ చేశారు. దేవదాస్ లో ఆకాంక్ష సింగ్, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మల్టీస్టారర్ సినిమా కావటంతో టాలీవుడ్ లో దీనిపై అంచనాలు కూడా అధికంగా ఉన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన లిరికల్‌ సాంగ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో దేవదాస్ సినిమా తెరకెక్కింది.

Next Story
Share it