Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

హరీష్ రావు సీటుకూ ఎసరొస్తుందా?.

0

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సీటుకూ ఎసరొస్తుందా?. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ పోటీ చేయనున్నారా?. ఈ ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. శుక్రవారం నాడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా టీఆర్ఎస్ లో పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా హరీష్ రావుకు సంబంధించి బిజెపి నాయకుడు రఘనందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో హరీశ్‌రావుకు  పొమ్మనలేక పొగ బెట్టినట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సిద్దిపేట నుంచి కేసీఆర్‌ పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోందని, హరీష్ కు పొగబెడుతున్నారనడానికి ఇదే సాక్ష్యమని పేర్కొన్నారు.

- Advertisement -

టీఆర్‌ఎస్‌లో ఇంటిపోరు తీవ్రమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. దీనిని ఉహించే కారుకు ఉన్నటువంటి 4 టైర్లలో ఒక టైరు పంచరై పక్కకు పోతుందని, అందుకే స్టెప్నీగా సంతోష్‌ను రాజ్యసభకు తెచుకున్నారని వ్యాఖ్యానించారు. ‘ఈ జన్మకు ఇది చాలు.. నా మీద ఇంత గొప్పగా మీరు చూపుతున్న ఆదరాభిమానాలు ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదనిపిస్తుంది’అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్న నేపథ్యంలో రఘునందన్‌రావు ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం. మొత్తానికి హరీష్ విషయంలో టీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున సాగుతుంది.

Leave A Reply

Your email address will not be published.