Telugu Gateway
Telangana

కన్ఫూజన్ లో కెసీఆర్ !

కన్ఫూజన్ లో కెసీఆర్ !
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కన్ఫూజన్ ఉంటదా?. ఎవరైనా నమ్ముతారా.అంటరా?. ఏమో ఆయన మాటలు చూస్తుంటే మాత్రం అలాగనే ఉన్నాయి. అదెలా అంటారా?. ఓ సారి మీరే చూడండి. అసలు ముందస్తు ఎన్నికల ఊసే లేనప్పటి నుంచి కూడా కెసీఆర్, కెటీఆర్ లు కూడా ‘వంద’ సీట్లకు తక్కువ కాకుండా టీఆర్ఎస్ కు వస్తాయని చెబుతనే ఉన్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ల మాటలను ప్రజలు నమ్మనట్లే కదా?. నిజంగా ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మితే టీఆర్ఎస్ కు వంద సీట్లు ఎలా వస్తాయి?. కెసీఆర్ దృష్టిలో అసలు ఏ మాత్రం నమ్మని కాంగ్రెస్ విమర్శలను నిజంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందా?. ఓ వైపు కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నేతలతో పాటు మీడియాలోనూ అసలు ప్రతిపక్ష పాత్ర పోషించటంలో కాంగ్రెస్ విఫలమైంది. కెసీఆర్ ఎన్నో ఆయుధాలు ఇఛ్చిన వాడుకోలేకపోయింది అనే విమర్శలు ఉన్నాయి. అలాంటిది ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ ఏకంగా ప్రతిపక్షం తెలంగాణలో రాజకీయ అరాచకం సృష్టిస్తున్నది..అందుకే ముందస్తుకు వెళుతున్నాం అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

అంటే సీఎం కెసీఆర్ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా సూపర్ సక్సెస్ అయినట్లేనా?. అంటే తెలంగాణలో తనకు బలమైన ప్రత్యర్ధి..ఏకంగా సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేయించిన క్రెడిట్ కెసీఆర్ స్వయంగా కాంగ్రెస్ పార్టీకి ఇఛ్చేస్తున్నట్లేనా?. అసెంబ్లీ రద్దు తర్వాత విలేకరుల సమావేశంలో చెప్పినట్లే..శుక్రవారం నాడు హుస్నాబాద్ సభలోనూ తెలంగాణ అసెంబ్లీ రద్దుకు కాంగ్రెసే కారణం అని కెసీఆర్ ప్రకటించటం విశేషం. మొత్తానికి అసెంబ్లీ రద్దుకు సహేతక కారణాలు చెప్పలేని ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ కాంగ్రెస్ పేరుతో బండి లాగించేయాలని చూస్తున్నారు. మరి ప్రజలు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా?. ఇదే స్పూర్తి ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ తోపాటు పలు ఇతర పార్టీలు డిమాండ్ చేసినప్పుడు ఎందుకు చేయలేదో?.

Next Story
Share it