Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు మరో కామెడీ

చంద్రబాబు మరో కామెడీ
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో సారి భారీ కామెడీనే చేశారు. తాజాగా గుంటూరులో జరిగిన మైనారిటీలో సభలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అదేంటి అంటే..చంద్రబాబు ఏకంగా ‘అలెగ్జాండర్’ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారట. ఈ దేశానికి అన్ని విధాలుగా అర్హత కలిగిన వ్యక్తి ఆయనే ఉండాలని చెప్పా. ప్రధాన మంత్రిని ఒఫ్పించి..దేశ అధ్యక్ష పదవికి సహకరించిన ఏకైక పార్టీ టీడీపీనే అని వ్యాఖ్యానించారు.

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు చెప్పాల్సిన చంద్రబాబు ఏకంగా అలెగ్జాండర్ ను దేశ రాష్ట్రపతిని చేశామని చెప్పటంతో ఈ వీడియోని చూసిన వారంతా అవాక్కు అవుతున్నారు. గతంలోనూ టీడీపీ బ్రిటీషర్లతోనూ పోరాడింది ఒక్క టీడీపీనే అంటూ కామెంట్ చేసి నెటిజన్లకు చిక్కారు చంద్రబాబు. ఇప్పుడు అలెగ్జాండర్ వంతు వచ్చింది. ఇదొక్కటే కాదు..చంద్రబాబు నోటి నుంచి జాలువారిని ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి.

https://www.youtube.com/watch?v=yM5caKur_Ho

Next Story
Share it