లాయర్ తో క్లోజయ్యే కేసును చంద్రబాబు భలే లాగారు!
‘బిజెపి నన్ను అరెస్టు చేయాలని చూస్తోంది. దీని కోసం ఎప్పటితో పాత కేసును బయటకు తీస్తోంది. మహారాష్ట్రలో ఉన్నది వాళ్ల ప్రభుత్వం కాదా?. కేంద్రంలో ఉన్నది వాళ్ల ప్రభుత్వం కాదా?.’ ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక నాపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు. నేను ప్రజల కోసం పోరాడుతున్నాను. అందుకే బాబ్లీ కేసులో ఇప్పుడు నాకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేశారు. ఇవీ ఓ నాలుగు రోజుల పాటు పదే పదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఈ నోటీసులను సాకుగా తీసుకుని..ఓ నాలుగైదు రోజులు టీవీల్లో..పేపర్లలో విపరీతమైన కవరేజ్ వచ్చేలా చూసుకుని..ఇప్పుడు కూల్ గా కేసు ను లాయర్ ను పంపి క్లోజ్ చేయించుకునే పనిలో పడ్డారు. వాస్తవానికి ఇది నిజంగా ‘లాయర్’ను పంపితే క్లోజయ్యే కేసే. కానీ చంద్రబాబు అలా కాదు కదా?. ప్రతి దాని నుంచి రాజకీయంగా ఎలా లబ్ది పొందాలి. ఎదుటి వారిపై ఎలా బురద పూయాలి అనే అంశంపై ఆయనకు ‘డాక్టరేట్’ ఉంది. నిజంగా చంద్రబాబు చెప్పినట్లే అటు మోడీ..ఇటు మహారాష్ట్ర సర్కారు ఆ కేసులో చంద్రబాబును అరెస్టు చేయాలనుకుంటే ఆగిపోతారా?. అలాంటిది ఏమీ లేదు. అంత వీక్ కేసును పట్టుకుని చంద్రబాబును టార్గెట్ చేసేంత విషయం తెలియని వాళ్లా మోడీ అండ్ టీమ్.
బాబ్లీ వ్యవహారంలో వచ్చిన ఎన్ బీడబ్ల్యూను ఉపయోగించుకుని ఎంత రాజకీయ ప్రయోజనం..ప్రచారం పొందాలో అంత పొంది..ఇప్పుడు తాను అమెరికా వెళుతున్నందున లాయర్ పంపి రీకాల్ పిటీషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం మంత్రులతో సమావేశాలు..అధికారులు..లాయర్లతో సమావేశాలు అంటూ నానా హంగామా. ఇంత చిన్న విషయానికి ఎంత పెద్ద రచ్చ చేశారో చంద్రబాబు. నిజంగా మోడీ సర్కారు బుక్ చేయాలనుకుంటే అంత తేలిగ్గా చంద్రబాబు బయటపడగలరా?. బహుశా ఇలాంటి విషయాల్లో చంద్రబాబు ‘ప్రచారం’ చూసి ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కూడా అవాక్కు అవుతుండాలి?.