కులాన్ని టార్గెట్ చేసినందుకే..రేవంత్ పై కేసు!?
హెచ్ఎంటీవీ చర్చలో రామారావు
‘రేవంత్ రెడ్డి చేసిన ఓ స్పీచ్ ఆందోళనకరం. ఆ స్పీచ్ లోని అంశాలు ఇక్కడ బహిరంగంగా కూడా చెప్పలేం. అది ఆయన తీరు. రేవంత్ రెడ్డి చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ కులాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అందుకే నాకు బాధ అన్పించింది. అది చూస్తే మా కులం వాళ్లు ఎవరైనా బాధ పడతారు. ’ ఇదీ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కేసు వేసిన రామారావు హెచ్ఎంటీవీలో జరిగిన చర్చలో చేసిన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి చేసిన ద్వేష వ్యాఖ్యల కారణంగానే తాను రేవంత్ రెడ్డి అంశంపై ఫోకస్ పెట్టినట్లు పరోక్షంగా రామారావు ఈ చర్చా కార్యక్రమంలో వెల్లడించారు. ఇదే చర్చలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ఇది అవినీతిపై పోరాటం అయితే ఓకేకానీ...ఇది కులపోరటం కాకూడదని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో ఆయన రేవంత్ రెడ్డి అక్రమాలకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. రేవంత్ రెడ్డికి హాంకాంగ్ బ్యాంకులో అకౌంట్ ఉందన్నారు. అదే సమయంలో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలను ఏర్పాటు చేసి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు రామారావు వెల్లడించారు. అయితే తన వెనక ఎవరూ లేరని...అన్ని అధికారికంగా రికార్డులు సేకరించిన తర్వాతే సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు.. ఈ కేసుకు సంబంధం ఉందని తాను అనుకోవటంలేదని రామారావు వెల్లడించారు.
.(రామారావు చేసిన ఈ స్పెసిఫిక్ వ్యాఖ్యలు ఈ వీడియోలో 16 నిమిషాల నుంచి 17.30 నిమిషాల మధ్యలో ఉంది. )
https://www.youtube.com/watch?v=zw7QBtjtqpA