Telugu Gateway
Andhra Pradesh

బడా కార్పొరేట్ సంస్థలో యువనేత 700 కోట్ల పెట్టుబడి?!

బడా కార్పొరేట్ సంస్థలో యువనేత 700 కోట్ల పెట్టుబడి?!
X

విదేశీ రూటు నుంచి వచ్చిన నిధులు!

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఓ బడా సంస్థలో ఏపీకి చెందిన యువనేత ఒకరు ఏకంగా 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారా?. అంటే అవుననే చెబుతున్నాయి పారిశ్రామిక వర్గాలు. కాకపోతే ఈ మొత్తం సదరు కంపెనీలోకి ‘విదేశీ రూట్’ నుంచే పెట్టుబడుల మార్గంలో వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత కొంత కాలంగా సదరు ‘గ్రీన్’ కంపెనీ భారీ ఎత్తున నిధులు సమీకరిస్తోంది. అవినీతి సొమ్మును విదేశాలకు తరలించి...అక్కడి నుంచి వివిధ కంపెనీల రూపంలో పెట్టుబడులు పెడుతున్నారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. సదరు సంస్థకు ఏపీలో భారీ ఎత్తున ప్రాజెక్టులు దక్కాయి. ఈ ప్రాజెక్టు వ్యయం కోసం ఈ మొత్తాలను తరలించి..అందులో వాటా తీసుకోనున్నారని చెబుతున్నారు. సదరు సంస్థకు ప్రభుత్వపరంగా కూడా ఏది కోరుకుంటే అది సమకూర్చిపెడుతున్నారు. ఏపీకి చెందిన నేతల ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం కూడా పూర్తి స్థాయి నజర్ పెట్టింది. అందులో భాగంగానే ప్రతి విషయాన్ని జల్లెడ పడుతున్నారు. అవినీతి సొమ్ము ఏ మార్గంలో వెళుతుంది..మళ్లీ అవే మొత్తాలు ఎలా తిరిగి వస్తున్నాయి అనే అంశాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి.

అయితే సదరు యువనేత ప్యామిలీ వేలాది కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఎంతో సురక్షితంగా విదేశాలకు తరలించి..అక్కడ నుంచి వివిధ రూపాల్లో వెనక్కి తెస్తోందని..అందులో భాగంగానే ఈ మొత్తం పెట్టుబడుల రూపంలో వచ్చాయని చెబుతున్నారు. ప్రస్తుతం రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ వోసీ) అధికారులతో పాటు..సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) అధికారుల పలు కంపెనీలకు చెందిన జాతకాలను తవ్వితీస్తున్నారు. ఏయే షెల్ కంపెనీల నుంచి నిధులు ఎక్కడకు వెళ్ళాయనే అంశాన్ని నిగ్గుతేల్చేపనిలో ఉన్నారు. త్వరలోనే అందుబాటులోకి వచ్చిన సమాచారం ఆధారంగా కేంద్రం చర్యలు మొదలుపెట్టనుంది. ఇందులో పలు పెద్ద తలకాయలు కూడా బయటకు వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it