Telugu Gateway
Andhra Pradesh

యనమల ‘అల్లుడి గిల్లుడు’!

యనమల ‘అల్లుడి గిల్లుడు’!
X

ఇది ఓ మంత్రి గారి అల్లుడి గిల్లుడు కధ. ఆ సదరు మంత్రి ఎవరో కాదు. ఈ మధ్యే పంటి రూట్ కెనాల్ చికిత్సకు సింగపూర్ లో 2.85 లక్షల రూపాయల బిల్లు చేసి ‘కొత్త చరిత్ర’ను లిఖించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఆయన అల్లుడు వెంకట గోపీనాధ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎపీఎంఎస్ ఐడీసీ) మేనేజింగ్ డైరక్టర్ గా ఉన్నారు. ఈ సంస్థ ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన సర్జికల్ ఎక్విప్ మెంట్ కొనుగోలుతోపాటు భవనాల నిర్వహణ వంటి బాధ్యతలు చూస్తుంది. ఈ కొనుగోళ్ల వ్యవహారం వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. వేల కోట్ల రూపాయల పనులు అంటే అక్కడ అవినీతి కూడా అంతే సహజం కదా?. ఎపీఎంఎస్ఐడీసీ ఎండీ నల్లగొండకు చెందిన ఓ వ్యక్తికి ఫేవర్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు హైదరాబాద్ సచివాలయానికి కూతవేటు దూరంలో ఓ కార్యాలయం ఉంది. నిబంధనల ప్రకారం లేక పోయినా ఆయనకు టెండర్ ఇవ్వటానికి రెడీ అయిపోయారని ఆ శాఖ వర్గాల సమాచారం.

అందుకు ఫ్రతిఫలంగా యనమల అల్లుడికి ఈ సంస్థ ప్రతినిధి ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారని ఎపీఎంఎస్ఐడీసీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. విషయం తరచి చూస్తే ఇది నిజమే అన్పిస్తోంది. ఎందుకంటే గోపీనాధ్ భార్య దివ్య తన ల్యాండ్ రోవర్ కారును నల్లగొండలో రిజిస్టర్ చేయించారు. ఫ్యాన్సీ నెంబర్ కోసం అయినా నల్లగొండలో రిజిస్టర్ చేయించాల్సిన అవసరం ఏముంది?. ఓ వైపు దివ్య తండ్రి యనమల రామకృష్ణుడు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. భర్త ఐఆర్ఎస్ అధికారి. ఆ డబ్బు అంతా సక్రమమే అయితే డమ్మీ అడ్రస్ పెట్టి నల్లగొండలో కారు రిజిస్టర్ చేయించాల్సిన పని ఉంటుందా?. ఈ అంశాలు అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే ఇది ఖచ్చితంగా అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చావలి దివ్య కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ కారు ధర 55 నుంచి 65 లక్షల రూపాయల వరకూ ఉంటుంది.

ఆమె కారు నెంబర్ టీఎస్ 05, EX 0001, కారు రిజిస్ట్రేషన్ కోసం ఆమె ఇచ్చిన అడ్రస్ చావలి దివ్వ, D/0, వై. రామకృష్ణుడు, ఇంటి నెంబర్. 6-2-1277, వెంకటేశ్వర కాలనీ, నల్లగొండ (మండలం), నల్లగొండ. ఈ కారు కొనుగోలుకు విజయవాడలోని ఇండియన్ బ్యాంకు నుంచి ఫైనాన్స్ తీసుకున్నట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఉంది. విజయవాడలో ఫైనాన్స్ తీసుకుని..నల్లగొండ లో కారు రిజిస్ట్రేషన్ చేయించాల్సిన పనేంటి?. అంటే ఎవరో సర్జికల్ ఎక్విప్ మెంట్స్ సరఫరా చేసే వ్యక్తులకు మేలు చేసి...వారితో ఈ కారు కొనుగోలు చేసినట్లు స్పష్టంగా కన్పిస్తోందని చెబుతున్నారు. మొత్తం చెల్లింపులు ఒకేసారి చేస్తే ఐటి పరంగా ఇబ్బందులు వస్తాయని..లోన్ కూడా తీసుకున్నారు. అయితే ఈ లోన్ మొత్తం ఎంత?. డౌన్ పేమెంట్ ఎంత చేశారన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి గోపీనాధ్ కూడా మామకు తగ్గ అల్లుడే అన్పించుకున్నారు.

Next Story
Share it