ప్రధాని హత్యకు కుట్ర కేసు...వరవరరావు అరెస్టు
BY Telugu Gateway28 Aug 2018 8:54 AM GMT
X
Telugu Gateway28 Aug 2018 8:54 AM GMT
విరసన నేత వరవరరావును పూణే పోలీసులు మంగళవారం నాడు హైదరాబాద్ లో అరెస్టు చేశారు ఉదయం నుంచి ఆయన ఇంటితోపాటు కుమార్తె ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వరవరరావుతో పాటు జర్నలిస్టు క్రాంతి నివాసంలో కూడా పోలీసుల సోదాలు కొనసాగాయి. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్‌లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో వరవరరావుని పోలీసులు విచారించారు. మోదీ హత్యకు వరవరరావు నిధులు సమకూర్చారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో అరెస్టయిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్‌టాప్‌లో దొరికిన లేఖ ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. పుణెలో నమోదైన కేసులో వీరందరినీ పోలీసులు విచారిస్తున్నారు.
Next Story