Telugu Gateway
Telangana

మంచిరెడ్డి... ముంద‌స్తు ధ‌న్య‌వాదాలు

మంచిరెడ్డి... ముంద‌స్తు ధ‌న్య‌వాదాలు
X

ఈ కామెడీ చూడండి. అస‌లు ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు ఏర్పాట్లే పూర్తి కాలేదు. కానీ అప్పుడే ఆ ఎమ్మెల్యే స‌భ‌ను విజ‌య‌వంతం చేసేశారు. స‌భ‌ను విజ‌య‌వంతం చేసిన నాయ‌కులు..కార్య‌క‌ర్త‌ల‌కు ధ‌న్య‌వాదాలు కూడా చెప్పేశారు. మీరు పై ఫోటోలో ఆ సీన్ చూడొచ్చు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్న టీఆర్ఎస్ భారీ ఎత్తున స‌భ నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. దీనికి ఏకంగా 25 ల‌క్షల మంది హాజ‌రు అయ్యేలా చూడాల‌ని టీఆర్ ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ పార్టీ నాయ‌కుల‌ను ఆదేశించారు.

ఈ స‌భ ద్వారా తెలంగాణ‌లో ఎన్నిక‌ల శంఖారావం పూరించాల‌ని కెసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. అయితే ఇబ్ర‌హీపట్నానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి ముంద‌స్తు ఎన్నిక‌ల జోష్ లో ఫ్లెక్సీ కూడా ముంద‌స్తుగానే పెట్టించిన‌ట్లు ఉన్నారు. స‌భ నిర్వ‌హ‌ణ‌కు వారం రోజులుపైన ఉండ‌గానే...ఇలా ముంద‌స్తు ధ‌న్య‌వాదాల ఫ్లెక్సీ క‌ట్టించారు. ఇది చూసిన వారంతా అవాక్కు అవుతున్నారు.

Next Story
Share it