‘కోటి’ దాటేసిన ఎన్టీఆర్ టీజర్
BY Telugu Gateway18 Aug 2018 9:31 PM IST
X
Telugu Gateway18 Aug 2018 9:31 PM IST
యూట్యూబ్ లో ఎన్టీఆర్ ఊచకోత మరోసారి మొదలైంది. ఇప్పటికే అరవింద సమేత రాఘవ సినిమాకు సంబంధించిన టీజర్ వ్యూస్ కోటి దాటేశాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న చిత్ర యూనిట్ ఈ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాయలసీమ యాసలో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు అభిమానులను ఆకట్టుకున్నాయి.
దసరాకు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డెతోపాటు ఇషా రెబ్బా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్ లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ‘అరవింద సమేత’ టీజర్ దూకుడు చూస్తుంటే మరి కొద్దిరోజుల్లోనే సరికొత్త రికార్డు నెలకొల్పడం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
Next Story