Telugu Gateway
Cinema

‘సైరా’ చిత్ర యూనిట్ కు సర్కారు షాక్

‘సైరా’ చిత్ర యూనిట్ కు సర్కారు షాక్
X

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక సినిమానే ‘సైరా నరసింహరెడ్డి’. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ తరుణంలో సైరా యూనిట్ కు షాక్ ఇచ్చారు రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా సెట్ వేయటమే కాకుండా..ఖాళీ చేయాలని ఆదేశించినా పట్టించుకోకపోవటంతో ప్రభుత్వ అధికారులు హీరో ఇంటి సెట్ ను కూల్చేశారు. ఈ సినిమాను చిరంజీవి తనయుడు రామ్ చరణే నిర్మాతగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ సెట్స్‌ లో రంగస్థలం షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రాంతంలో సైరా సినిమా కోసం కూడా సెట్ వేశారు. అయితే ఇది ప్రభుత్వ భూమి కావడంతో ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఇప్పుడు సైరా చిత్రం కోసం అక్కడ సెట్స్ నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెవెన్యూ అధికారులు సైరాలో కథానాయకుడి ఇంటి సెట్‌ని కూల్చివేశారు. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు అందించినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే కూల్చివేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.

Next Story
Share it