Telugu Gateway
Politics

సోమ్ నాథ్ చటర్జీ మృతి

సోమ్ నాథ్ చటర్జీ మృతి
X

సీనియర్ పార్లమెంటేరియన్, లోక్ సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ సోమవారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో భాధపడుతున్నారు. సోమ్ నాధ్ వయస్సు 89 సంవత్సరాలు. సోమ్ నాధ్ చటర్జీ లోక్ సభకు పది సార్లు ఎంపిక కావటం విశేషం. కోల్‌కతాలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 1929, జూలై 25న అసోంలోని తేజ్‌పూర్‌లో సోమ్‌నాథ్‌ చటర్జీ జన్మించారు.

మిత్రా ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్య పూర్తి చేసి, ప్రెసిడెన్సీ కాలేజీ, కలకత్తా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1968లో సీపీఎంలో చేరారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్‌ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు.

Next Story
Share it