Telugu Gateway
Cinema

‘సిల్లీ ఫెలోస్’ వస్తున్నారు

‘సిల్లీ ఫెలోస్’ వస్తున్నారు
X

అల్లరి నరేష్ కు ఈ మధ్య కాలం కలసి రావటం లేదు. చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద ఫట్ మంటున్నాయి. దీంతో ఇప్పుడు ‘మల్టీస్టారర్’ లను నమ్ముకున్నాడు. మహేష్ బాబు సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అల్లరి నరేష్, హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసి విఫలమైన సునీల్ లు జంటగా ‘సిల్లీ ఫెలోస్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అల్లరి నరేష్ కు సుడిగాడు వంటి హిట్ సినిమాను అందించిన భీమినేని శ్రీనివాస్‌ దర‍్శకత్వంలోనే ఈ సిల్లీ ఫెలోస్‌ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌.

అందులో భాగంగా సినిమాకు సంబంధించిన మోషన్ టీజర్ ను విడుదల చేశారు. బైక్‌ పైన వెళుతున్న నరేష్‌, సునీల్ మధ్య జరిగే సంభాషణతో ఈ టీజర్‌ను డిజైన్‌ చేశారు. ఈ స్పీడ్ లో వెళితే గంటలో శ్రీశైలం వెళతాం కదరా? అని అల్లరి నరేష్ అంటుంటే..గంట ఎందుకురా..అర గంటలోనే వెళతాం కైలాసానికి అంటూ సునీల్ చెప్పే డైలాగ్ తో ఈ మోషన్ టీజర్ విడుదల చేశారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=HLHqj5-dVs4

Next Story
Share it