Top
Telugu Gateway

రాజశేఖర్ ‘కల్కి’ లోగో విడుదల

రాజశేఖర్ ‘కల్కి’ లోగో విడుదల
X

గరుడవేగ సినిమాతో సక్సెస్ అందుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమానే ‘కల్కి’. లోగో టీజర్ ను చిత్ర యూనిట్ రాఖీ సందర్బంగా ఆదివారం నాడు విడుదల చేసింది. కల్కిని స్వయంగా రాజశేఖర్ మరో నిర్మాత సీ కళ్యాణ్ తో కలసి తెరకెక్కిస్తున్నారు. ‘అ!’ వంటి వినూత్న చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

వచ్చే నెల నుంచే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం దటీజ్ మహాలక్ష్మి సినిమా పనుల్లో ఉన్నారు. కల్కి సినిమా 1983 నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కనుంది. శ్రీ మహా విష్ణువు దశావతారాలకు సంబంధించిన వివిధ వస్తువులతో ఈ టైటిల్‌ టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. కల్కి సినిమాలో ఇతర నటీనటులను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

https://www.youtube.com/watch?v=eXY506_DAsw

Next Story
Share it