పవన్ కళ్యాణ్ ది బొమ్మ తుపాకీ
BY Telugu Gateway4 Aug 2018 4:15 AM GMT

X
Telugu Gateway4 Aug 2018 4:15 AM GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శల దాడి పెంచారు. అసలు వచ్చే ఎన్నికల్లో పవన్ తమకు పెద్ద సమస్యే కాదన్నట్లు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఆయనే చేసే విమర్శలను చాలా లైట్ గా తీసుకుని..అంతే లైట్ గా కామెంట్లు చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తాజాగా పవన్ ను ఏమన్నార ఓ సారి లుక్కేయండి. ‘ఒకాయన రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తారట.. తుపాకీ పడతారట.. కోర్టుకు వెడతారట.. బొమ్మ తుపాకీ.. సినిమా ఫైట్‌తో రాజధానిని ఆపేస్తారా? వాక్చాతుర్యంతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోరు... తాను నక్సలైట్‌నని కూడా ఆయన చెబుతున్నాడు.. అడవిలోకి వెళ్లి వస్తే తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
Next Story