పవన్ ఐటి కంపెనీలు తెస్తే...లోకేష్ ప్రారంభోత్సవాలు చేస్తారా?
ఐటి రంగంలో ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ పేరుతో మంత్రి నారా లోకేష్ తన శాఖ ద్వారా వందల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిస్తారు. ఆయన అమెరికాతోపాటు పలు దేశాలు అలా పర్యటించి వస్తారు. ఏపీకి వచ్చిన కంపెనీలకు అడ్డగోలు రాయితీలు ఇస్తూ ఈ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకుంటారు. తాము ఉండబట్టే కంపెనీలు వచ్చాయి అని కలరింగ్ ఇస్తారు. కానీ వాస్తవం వేరు. రాయితీలకు మీద రాయితీలు ఇస్తూ కంపెనీలను ఏపీకి తెచ్చి ఇదంతా తమ ఘనత గా చెప్పుకుంటున్నారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఒకే తానులోని వ్యక్తులే. ఇప్పుడు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కొత్త పాట అందుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయటం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టడానికి వెనకాడుతున్నాయట. అంటే పవన్ ఆరోపణలను ఆ కంపెనీలు నమ్ముతున్నట్లేనని లోకేష్ అంగీకరించినట్లే? అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ ఆరోపణలతో ఏపీలో ఐటి గ్రోత్ ఆగిపోతుందా? ఐటి శాఖ మంత్రి, ఐటి శాఖ అంత బలహీనంగా ఉన్నాయా?. పైగా నారా లోకేష్ ఓ కొత్త ప్రతిపాదన పెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని ఐటి కంపెనీలను తెస్తే ఇప్పుడు ఇస్తున్న రాయితీలు ఇస్తారంట.
అంటే ఎమ్మెల్సీ మార్గంలో మంత్రి అయి..విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తూ...ప్రభుత్వంపై పెత్తనం చేసే లోకేష్ కు పవన్ కళ్యాణ్ సాయం అవసరమా?. ప్రభుత్వం బయట ఉన్న పవన్ కళ్యాణ్ ఐటి కంపెనీలు తెస్తే ..మంత్రి నారా లోకేష్ ప్రారంభోత్సవాలు చేస్తారా?. అంటే తమకు చేతకావటం లేదని అంగీకరిస్తున్నారా? ప‌్రతిష్టాత్మక కంపెనీలతో పేరుతో ఐటి శాఖలో వందల కోట్ల రూపాయల స్కామ్ లు చేస్తున్న నారా లోకేష్ రివర్స్ గేర్ లో మళ్లీ పవన్ కళ్యాణ్ కంపెనీలు తెస్తే రాయితీలు ఇస్తామని ప్రకటించటం విశేషం. తనపై ఆరోపణలకు ఆధారాలు చూపించాలని మంత్రి నారా లోకేష్ పదే పదే కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన వద్ద ఉన్న ఆ ఫైల్ ఏదో ఓ సారి బహిర్గతం చేస్తే అసలు విషయం ఏంటో తెలిసిపోతుంది కదా?. భవిష్యత్ లో ఏపీకి వచ్చే ఐటి కంపెనీలకు కూడా మరింత క్లారిటీ వస్తుంది. తమకు వచ్చే భూమిలో వారి వాటాగా ఎంత ఇవ్వాలో?.