Telugu Gateway
Cinema

మహేష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఆగస్టు9న

మహేష్ కొత్త సినిమా  ఫస్ట్ లుక్ ఆగస్టు9న
X

‘భరత్ అనే నేను’ సినిమాతో మళ్ళీ మహేష్ బాబు ‘హిట్’ ట్రాక్ లోకి వచ్చాడు. అంతకు ముందు చేసిని సినిమాలు అన్నీ డిజాస్టర్స్ కావటంతో కొరటాల శివ సినిమా ఈ సూపర్ స్టార్ కు కొత్త ఎనర్జీ ఇఛ్చిందనే చెప్పొచ్చు. ఇప్పుడు మహేష్ బాబు 25వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుతోంది. అంతే కాదు..ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మహేష్ బాబు పుట్టిన రోజు అయిన ఆగస్టు 9న విడుదల కానుంది. అదే రోజు టైటిల్ పేరు కూడా వెల్లడించునున్నారు. ఇఫ్పటికే టైటిల్ కు సంబంధించి పలు క్లూస్ ఇస్తున్నారు దర్శకుడు పైడిపల్లి వంశీ. ఈ ప్రతిష్టాత్మక సినిమా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను అశ్వినీదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విడుదల తేదీని కూడా ఇఫ్పటికే ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు పైడిపల్లి వంశీ విడుదల చేసిన ‘ఆర్..ఐ..ఎస్’ అక్షరాల ప్రకారం సినిమా రిషిగా ఉండే అవకాశం ఉందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ఈ సస్పెన్స్ ఆగస్టు9తో తొలగిపోనుంది.

Next Story
Share it