కుర్చీలో కూర్చుని కుమ్మేస్తున్న తారక్
BY Telugu Gateway13 Aug 2018 10:41 AM IST

X
Telugu Gateway13 Aug 2018 10:41 AM IST
ఇప్పటికే డేట్ ఫిక్స్ అయింది. ఇప్పుడు టైమ్ కూడా ఫిక్స్ అయింది. అంతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇక పండగే. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘అరవింద సమేత రాఘవ’ సినిమాకు సంబంధించిన టీజర్ ఆగస్టు 15 ఉదయం తొమ్మిది గంటలకే విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఎన్టీఆర్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇది చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే. ఎందుకంటే కుర్చీలో కూర్చుని ఈ హీరో కుమ్మేస్తున్నట్లు ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావటం విశేషం.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో లీక్ అయి కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓ రైల్వే స్టేషన్ లో ఇప్పుడు ఎన్టీఆర్, పూజా హెగ్గేలకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
Next Story



