Telugu Gateway
Telangana

నాలుగు రోజుల్లో పుట్టిన రోజు ఉండగా..!

నాలుగు రోజుల్లో పుట్టిన రోజు ఉండగా..!
X

నందమూరి హరికృష్ణ పుట్టిన రోజు సెప్టెంబర్ 2, 1956. అంటే మరో నాలుగు రోజుల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన ఆయన అకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. నెల్లూరులో జరిగే ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఆయన కారులో వెళుతూ ప్రమాదం బారిన పడ్డారు. కేరళలో వరదల కారణంగా ఈ సారి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని హరికృష్ణ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అభిమానులకు ఓ లేఖను కూడా సిద్ధం చేశారు.

హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా నల్లగొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇఫ్పుడు హరికృష్ణ కూడా అదే జిల్లాలో తుది శ్వాస విడిచారు. హరికృష్ణ తనయుడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ భారీ ప్రమాదం నుంచి బయటపడిన సంగతి తెలిసిందే.

Next Story
Share it