Telugu Gateway
Cinema

‘గీత గోవిందం’ కలెక్షన్లు ఫుల్

‘గీత గోవిందం’ కలెక్షన్లు ఫుల్
X

బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘గీత గోవిందం’ దుమ్మురేపుతోంది.దేశంతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమా కలెక్షన్లు అదిరిపోతున్నాయి. ఫస్ట్ డే..ఫస్ట్ షో నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో పాటు యూత్ లో విజయ్ కు ఉన్న క్రేజ్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు ఈ సినిమాను రొటీన్ కు భిన్నంగా సెలవు రోజు అయిన ఆగస్టు 15న (బుధవారం) విడుదల చేశారు. వరస సెలవులు కూడా సినిమా కలెక్షన్లు పెరగటానికి కారణం అయింది.

గీత గోవిందం సినిమాలో అటు విజయ్ దేవరకొండ నటనతోపాటు..హీరోయిన్ రష్మిక మందన కూడా తన సత్తా చాటారు. ఈ జోడీ సినిమాను సరదాగా చేయటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లే..కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండగా..రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరగటం ఖాయంగా చెబుతున్నారు. అమెరికాలో ఇప్పటికే పది లక్షల డాలర్ల మార్క్ ను దాటేసి..మరింత ముందుకెళుతోంది.

Next Story
Share it