Telugu Gateway
Cinema

విజయ్ కెరీర్ లో ‘రికార్డు’

విజయ్ కెరీర్ లో ‘రికార్డు’
X

విజయ దేవరకొండ. టాలీవుడ్ లో ఇప్పుడు సెన్సేషనల్ హీరోగా మారారు. చేసిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ అవుతుండటంతో క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. అంతే కాదు..విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాతో కొత్త మైలురాయిని అందుకున్నారు. అమెరికాలో ఆయన సినిమా గీత గోవిందం ఇప్పటికే 2 మిలియన్ మార్క్ ను దాటేసింది. విజయ్ సినిమాల్లో 2 మిలియన్ల మార్క్ ను దాటిన మొదటిది ఇదే.

గీత గోవిందం సినిమా విడుదలైన దగ్గర నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో విజయ్ కలెక్షన్ల ద్వారా తన సత్తా చాటారు. ఇప్పటికే తెలుగు మార్కెట్లో ఈ సినిమా 75 కోట్ల రూపాయల పైనే గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు అమెరికా మార్కెట్ లోనూ దుమ్మురేపుతోంది. ఈ సినిమాలో విజయ దేవరకొండతోపాటు హీరోయిన్ రష్మిక మందన నటనకు మంచి మార్కులే పడ్డాయి.

Next Story
Share it