Top
Telugu Gateway

చంద్రబాబును కలసిన రానా

చంద్రబాబును కలసిన రానా
X

దగ్గుబాటి రానా శుక్రవారం నాడు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. ఎన్టీఆర్ బయోపిక్ లో రానా నటిస్తున్న విషయం తెలిసిందే. రానాతోపాటు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కూడా చంద్రబాబును కలసిన వారిలో ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక సినిమా ఎన్టీఆర్ బయోపిక్ లో తాను నటిస్తున్న విషయంలో రానా ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. ఈ సినిమాలో రానా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నట్లు చంద్రబాబు పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

అందులో భాగంగానే చంద్రబాబును కూడా కలసినట్లు చెబుతున్నారు. బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు కథను చెప్పడానికి నేను కూడా కలిసి వస్తున్నాను’ అంటూ ఈ సినిమాలో తాను నటిస్తున్న విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా రానా వెల్లడిస్తూ..బాలకృష్ణ, క్రిష్ లతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.

Next Story
Share it