వాజ్ పేయికి చంద్రబాబు నివాళి

X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం ఢిల్లీలో దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో పలు సంస్కరణలకు వాజ్ పేయి ఆద్యుడని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన ఎంతగానో సహకరించారన్నారు.
నమ్ముకున్న సిద్ధాంతాలకు ఆయన కట్టుబడి ఉన్నారన్నారు. వాజ్ పేయి మరణంతో దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. వాజ్ పేయి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు జరగనున్నాయి.
Next Story



