Telugu Gateway
Andhra Pradesh

జ‌గ‌న్ తో మాజీ డీజీపీ భేటీ

జ‌గ‌న్ తో మాజీ డీజీపీ భేటీ
X

వైసీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో ఏపీ మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావు భేటీ అయ్యారు. పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ ను ఆయ‌న బ‌స చేసిన ప్రాంతానికి వెళ్లి మ‌రీ సాంబ‌శివ‌రావు భేటీ కావ‌టం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయ‌న‌కు ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్లు ఎప్ప‌టి నుంచో ప్ర‌చారంలో ఉంది. ఈ త‌రుణంలో జ‌గ‌న్ తో సాంబ‌శివ‌రావు భేటీ కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ భేటీ మ‌ర్యాద‌పూర్వ‌కంగా జ‌రిగింద‌ని పైకి చెబుతున్నా..త్వ‌ర‌లోనే ఆయ‌న వైసీపీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇరువురు దాదాపు 15 నిమిషాలు చర్చించుకున్నారు.

Next Story
Share it