Telugu Gateway
Andhra Pradesh

రాజధాని పనుల్లో సీఎంకే ఐదు శాతం కమీషన్లు!

రాజధాని పనుల్లో సీఎంకే ఐదు శాతం కమీషన్లు!
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దోపిడీ అడ్డగోలుగా సాగుతోంది. సాక్ష్యాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండ్ టీమ్ కే ప్రతి పనిలో ఐదు శాతం కమిషన్లు వెళుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయమే. ఇప్పటికే ఖరారు అయిన సుమారు నలభై వేల కోట్ల రూపాయల పాత పనులకు సంబంధించిన టెండర్లకు కూడా ఐదు శాతం అదనంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ లు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తొలుత మొబిలైజేషన్ అడ్వాన్స్ పది శాతం ఉండగా..తాజాగా 15 శాతానికి పెంచారు. టెండర్ నిబంధనల్లో పెట్టకుండా..పనులు అప్పగించిన తర్వాత ఇలా చేయటం ఏ మాత్రం సరికాదని ఆర్థిక, న్యాయ శాఖలు తిరస్కరించినా..చంద్రబాబు కేబినెట్ లో పెట్టి ఓకే చేయించుకున్నారు. భవిష్యత్ లో చేపట్టబోయే పనులకు కూడా ఇదే వర్తిస్తుంది. నిజంగా రాజధానిలో పనులు అంత లాభదాయకం కాకపోతే కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు వస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ మెప్పు పొందటం కోసం ఏ కాంట్రాక్టర్ అయినా పనిచేయరు కదా?. టెండర్ లో పాల్గొని పనులు దక్కించుకున్న సంస్థలు తమకు అదనపు మొబిలైజేషన్ అడ్వాన్స్ కావాలని కోరటం ఏంటి?. ఇందుకు అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపటం ఏమిటి?.

ఉన్నతాధికారులు అందరూ వ్యతిరేకించినా చంద్రబాబు కేబినెట్ ఓకే చేయటం ఏమిటి?. అంటే ఆ మేరకు సొంత ఖాతాలోకి వెళతాయి కాబట్టి అందరూ ఓకే చెప్పారన్న మాట. చంద్రబాబు నిర్ణయాన్ని కేబినెట్ లో ఎవరూ ప్రశ్నించరు కూడా. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఏది తలచుకుంటే అది జరిగిపోతుంది అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి. ఓ వైపు రాజధాని కోసం రైతులు ఇఛ్చిన భూములను పీపీపీ పేరుతో ఎడాపెడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేస్తూ ..మరో వైపు టెండర్లలోనూ భారీ ఎత్తున దోపిడీకి శ్రీకారం చుడుతున్నారు. దీనికి తోడు అంచనాల పెంపు మరో కామన్ పాయింట్. వాస్తవానికి మొబిలైజేషన్ అడ్వాన్స్ పది శాతం ఉన్నప్పుడే కమీషన్ ఐదు శాతం ఉండేదని..ఇప్పుడు అది కాస్తా పెంచినందున ఈ మొత్తం కూడా పెరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంలోనూ కోట్లాది రూపాయల అదనపు చెల్లింపులు చేసిన విషయం తెలిసిందే. అంతచేసినా అవి నాసిరకం...వర్షాలు కురిసే భవనాలుగా చరిత్రలో నిలిచిపోతున్నాయి.

Next Story
Share it