కొత్త సినిమాకు ఓకే చెప్పిన అనుష్క
BY Telugu Gateway25 Aug 2018 7:42 AM GMT

X
Telugu Gateway25 Aug 2018 7:42 AM GMT
భాగమతి సినిమా తర్వాత కన్పించకుండా పోయిన అనుష్క కొత్త సినిమాకు ఓకే చెప్పేసింది. దీంతో చాలా గ్యాప్ తర్వాత స్వీటీ మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో మాధవన్ కు జోడీగా అనుష్క కన్పించనుంది. కోన వెంకట్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
‘సైలెంట్’ పేరుతో తెరకెక్కుతోంది ఈ సినిమా. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. థ్రిల్లర్ జానర్ లో రానున్న మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించనున్నారు. వస్తాడు నా రాజు సినిమాకు దర్శకత్వం వహించిన హేమంత్ మధుకరే ఈ సైలంట్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
Next Story