హైదరాబాద్ కు ఆమ్రపాలి
BY Telugu Gateway29 Aug 2018 9:07 PM IST

X
Telugu Gateway29 Aug 2018 9:07 PM IST
వరంగల్ అర్భన్ కలెక్టర్ గా ఇటీవల వరకూ బాధ్యతలు నిర్వహించిన ఆమ్రపాలికి హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. ఆమెకు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు. బదిలీ చేసిన రోజు ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టారు. బుధవారం నాడు ఆమెకు పోస్టింగ్ ఇస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ అర్భన్ కలెక్టర్ గా ఆమ్రపాలి ఎంతో ఆదరణ చూరగొన్నారు. అదే సమయంలో అప్పుడప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా మారారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే సంకేతాలు ఉండటంతోపాటు..ఓటర్ల జాబితా సవరణ ఉన్నందున వచ్చే జనవరి వరకూ అధికారులను బదిలీ చేసే అవకాశం లేకపోవటంతో ..సర్కారు ఐఏఎస్ లో పాటు ఐపీఎస్ అధికారులను కూడా పెద్ద ఎత్తున బదిలీ చేసింది. అందులో భాగంగానే ఆమ్రపాలికి కూడా స్థాన చలనం కలిగింది.
Next Story



