Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ట్యూన్స్...ఏపీసీఆర్ డీఏ డ్యాన్స్

చంద్రబాబు ట్యూన్స్...ఏపీసీఆర్ డీఏ డ్యాన్స్
X

మైస్ హబ్ దోపిడీ స్కీమ్ 42 ఎకరాల నుంచి 84 ఎకరాలకు పెంపు

ఏపీ సీఎం చంద్రబాబు ట్యూన్స్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీసీఆర్ డీఏ) డ్యాన్స్ చేస్తుందా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. భారీ దోపిడీ స్కీమ్ అయిన మైస్ హబ్ భూ కేటాయింపులు ఒకేసారి 42 ఎకరాల నుంచి 84 ఎకరాలకు పెరగటంలో మతలబు ఏమిటి?. అసలు ఏ ప్రాతిపదికన ముందు 42 ఎకరాలు సరిపోతాయని టెండర్ పిలిచారు?. మళ్ళీ ఇప్పుడు దాన్ని మార్చేసి ఏ ప్రాతిపదికన 84 ఎకరాలకు పెంచారు?. దీని వెనక పెద్ద కారణాలు ఏమీ ఉండవు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు...సీఆర్ డీఏ అమలు. అంతే. రాజధాని కోసం రైతులు ఇఛ్చిన భూములను ఎలా దోచుకోవాలో చంద్రబాబు ప్లాన్స్ వేసుకుంటారు. దీనికి రకరకాల స్కీమ్ లు అమలు చేస్తారు. మధ్యలో ఎవరైనా వచ్చి దాని కంటే ఇది బాగుంటుందని సలహా ఇస్తే దాన్ని వెంటనే మార్చేస్తారు. ఎందుకంటే కొత్తది మరింత లాభదాయం కాబట్టి. కొద్ది రోజుల క్రితమే ఏపీసీఆర్ డీఏ అమరావతిలో మొత్తం 42 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, బాగస్వామ్య (పీపీపీ) విధానంలో మీటింగ్స్, ఇన్సెంటివ్స్,కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్ (మైస్ హబ్) ఏర్పాటు ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 22 ఎకరాల్లో మైస్ హబ్ ఏర్పాటు..మిగిలిన 20 ఎకరాలను బిడ్ దక్కించుకున్న సంస్థ వాణిజ్య అవసరాలకు వాడుకునేలా సర్వ హక్కులు కల్పిస్తామని ప్రకటించారు.

కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ మైస్ హబ్ భూమి కాస్తా 42 ఎకరాల నుంచి 84 ఎకరాలకు పెరిగింది. మరి ముందు 42 ఎకరాలతో ప్లాన్స్ ఎవరు తయారు చేశారు. మళ్ళీ ఇప్పుడు ప్లాన్ ఎందుకు మారింది?. అంటే కేవలం ఇందులో దోపిడీ కోణం తప్ప మరొకటి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా పిలిచిన ఆర్ఎఫ్ పిలో 42 ఎకరాలకు ఎఫ్ఎస్ఐ 5 తో అనుమతి ఇస్తామని, 22 ఎకరాల్లో మైస్ హబ్ ఏర్పాటు చేయాలని, 20 ఎకరాలను తొలుత చెప్పినట్లే డెవలపర్ వాణిజ్య అవసరాల కోసం కేటాయించనున్నారు. ఏకంగా భూమి 42 ఎకరాల నుంచి 84 ఎకరాలకు పెరగటం వల్ల వచ్చే లాభం ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి పోవటం ఖాయం అని చెబుతున్నారు. దీనికి తోడు ప్రాజెక్టు అంచనా వ్యయాలు..అన్నింట్లోనూ గోల్ మాల్ జరుగుతోందని మౌలికసదుపాయాల శాఖ వర్గాలే చెబుతున్నాయి. రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని చంద్రబాబు తన ఇష్టానుసారం దందా సాగిస్తున్నారనటానికి ఇంత కంటే నిదర్శనం ఏమి కావాలి?. మైస్ హబ్ కింద 22 ఎకరాల్లో ఓ మెగా కన్వెన్షన్ సెంటర్ తో పాటుఓ ఫైవ్ స్టార్ హోటల్, భారీ ఎగ్జిబిషన్ సెంటర్ వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది.

Next Story
Share it