‘మూడు లుక్స్’ తో బయటికొచ్చిన రవితేజ
BY Telugu Gateway28 Aug 2018 9:22 AM IST
X
Telugu Gateway28 Aug 2018 9:22 AM IST
రవితేజ కొత్త సినిమా శరవేగంగా రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ హీరో మూడు లుక్స్ తో బయటకు వచ్చాడు. అదేనండి ఆయన కొత్త సినిమా అమర్..అక్భర్..అంటోని ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఇలియానా నటిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ లో వరస విజయాలు దక్కించుకుంటున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
శ్రీను వైట్ల..రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ‘వెంకీ, దుబాయ్ శీను’ కూడా విజయాలు సాధించాయి. ఈ అమర్ అక్భర్ ఆంటోని విజయంపై కూడా చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. రవితేజ తొలిసారి మూడు పాత్రల్లో ఈ సినిమాలో కన్పించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. అక్టోబర్ 5న రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.
Next Story