‘అప్పుడే కాదు’ అంటున్న ఐశ్యర్యారాయ్
ఐశ్వర్యారాయ్. ఒకప్పటి ప్రపంచ సుందరి. ఆమె జీవిత కథ తెరకెక్కిస్తే..సహజంగా పెద్ద సంచలనమే అవుతుంది. అందగత్తెల జీవితంలో ఏముందో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అందునా ఐశ్వర్యారాయ్ వంటి అందగత్తె విషయంలో అయితే అది మరీనూ. దీనికి తోడు ప్రస్తుతం అంతా బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. అందుకే ఈ మధ్య ఎవరో ఐశ్వర్యారాయ్ వద్ద బయోపిక్ గురించి ప్రస్తావిస్తే ఆమె చాలా నిజాయతీగా స్పందించారు. బయోపిక్ తీస్తే అందులో అన్నీ నిజాలు చెప్పాలి. ఏమీ దాయకూడదన్నారు. అంతే కాదు..బయోపిక్ కు కావాల్సిన మెటీరియల్ అంతా తన జీవితంలో ఉందని...అయితే దీనికి ఇంకా సమయం ఉందని వ్యాఖ్యానించారు. సో...ఇప్పటికిప్పుడు కాకపోయినా.. ఐశ్వర్యారాయ్ జీవిత చరిత్ర కూడా తెరకెక్కనుందన్న మాట. ఎంత ప్రపంచ సుందరి అయినా ఐశ్వర్య జీవితం అంత పూలపాన్పు ఏమీ కాదు. అందరిలాగే ఆమె కూడా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.
చివరకు కుదురుకున్నారు. ప్రస్తుతం ఆమె జీవితం సాఫీగానే సాగిపోతోంది. ఆర్కిటెక్చర్ స్టూడెంట్ అయిన ఆమె ‘మిస్ వరల్డ్’ కాకపోయి ఉంటే..దీనికి ఎవరి దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. ఎవరైనా సరే కాలం తీసుకెళ్లిన దారిలో నడవాల్సిందే. అందులో ఎవరికీ మినహాయింపులు ఉండవు. బయోపిక్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఆడియన్స్ ను ఎంటర్‌టైన్ చేస్తుందంటే తప్పకుండా నా బయోపిక్ తెరకెక్కాలని నేను కోరుకుంటాను. కానీ ఇప్పుడే ఈ ఆలోచన లేదు’’ అన్నారు. బయోపిక్‌లో నిజాలను దాచనంటున్నారు ఐశ్వర్య. మరి... నిజంగా ఐశ్వర్య బయోపిక్ తీస్తే అందులో ఆమె మాజీ ప్రేమికుడు సల్మాన్‌ఖాన్ పాత్రను ఎలా జస్టిఫై చేస్తారనే ఆసక్తి సినీ లవర్స్ లో తప్పుకండా ఉంటుందని అనుకోవచ్చు. చూడాలి ఐశ్వర్య బయోపిక్ తెరకెక్కితే ఎన్ని సంచలనాలు నమోదు అవుతాయో.