Telugu Gateway
Politics

టీఆర్ఎస్ బిజెపి బీ టీమ్ గా మారింది

టీఆర్ఎస్ బిజెపి బీ టీమ్ గా మారింది
X

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన రాజకీయాలను వేడెక్కిస్తోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. గత కొంత కాలంగా టీఆర్ఎస్ కేంద్రంలోని అధికార బిజెపితో సన్నిహితంగా ఉంటోంది. తాజాగా జరిగిన రాజ్యసభ వైఎస్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్ధికే ఓటు వేసి టీఆర్ఎస్ మరింత దగ్గరైంది. ఇదే అదనుగా టీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎటాక్ ప్రారంభించింది. తెలంగాణ సర్కారు విద్యార్దుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపీ మధు యాష్కీ ఆరోపించారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తానన్న కేసీఆర్.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు‌ మాత్రం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదనిఅన్నారు.

ప్రభుత్వం ప్రజలను నియంతృత్వంతో పరిపాలిస్తుందన్నారు. సాగుకోసం రైతులు నీళ్లు అడిగితే ఊళ్లకు ఊళ్లను నిర్బంధిస్తున్నారని విమర్శించారు. తన అవినీతి బయటపడుతుందనే కేసీఆర్‌ మోడీ కాళ్ళు మొక్కుతూ తిరుగుతున్నారని మధు యాష్కి విమర్శించారు. ప్రత్యేక ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన అన్ని ప్రజా సంఘాలు, వర్గాలు, మహిళలు ముందుండి ఈ ప్రజాకంటక పాలనను గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ బిజెపి బీ టీమ్ గా మారిందని ఎద్దేవా చేశారు.

Next Story
Share it