Telugu Gateway
Cinema

‘ఆటగాళ్ళు’ మూవీ రివ్యూ

‘ఆటగాళ్ళు’ మూవీ రివ్యూ
X

నారా రోహిత్. విభిన్న అంశాలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నా..సరైన హిట్ అందుకోలేకపోతున్నారు. ఇక జగపతిబాబు విషయానికి వస్తే హీరో నుంచి విలన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ గా మారి తన సత్తా చాటుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే ‘ఆటగాళ్ళు’. సుదీర్ఘ విరామం తర్వాత పరుచూరి మురళీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నారా రోహిత్ దర్శకుడి పాత్రలో కన్పిస్తారు. తాను అమితంగా ప్రేమించే అమ్మాయి అయిన అంజలి (దర్శన బానిక్)ను పెళ్లి చేసుకుంటాడు. వీళ్ల సంసారం అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో అంజలి హత్యకు గురవుతుంది. అసలు హత్య ఎవరు చేశారు?. ఈ కేసు నుంచి హీరో బయపడతారా? లేదా అన్నదే సినిమా. హత్య కేసులో ఆరోపణలో ఎదుర్కొనే సిద్ధార్ధ్, ఈ కేసును విచారించే లాయర్ పాత్రలో జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు..సంబాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. నారా రోహిత్, జగపతిబాబుల మధ్య జరిగే మైండ్ గేమ్ ఈ సినిమాకు ప్రధాన బలం. వీరిద్దరూ తమ పాత్రలకు న్యాయం చేసినా సినిమా స్లో నేరేషన్ మైనస్ పాయింట్ గా మారింది.. ఫస్టాఫ్ లో ఎక్కువ భాగం లవ్ ట్రాక్ తో నడిపించేసి..తర్వాత అసలు కధలోకి వెళతారు.

చాలా కాలం తర్వాత బ్రహ్మానందం మళ్ళీ ఈ సినిమాలో మెరిశారు. ఆయన కామెడీ పెద్దగా పండకపోయినా..సో సోగా ఉంది. కథనంలో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం లేదు. ముఖ్యంగా లవ్ ట్రాక్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కోర్టు సీన్ స్టార్ట్ అయిన తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. సాయి కార్తీక్‌ సంగీతం పరవాలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఈ సినిమాలో జగపతిబాబు, నారా రోహిత్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో సినిమా కాస్త సరదాగా సాగిపోతుంది. ఈ సినిమాకు వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు నిర్మాతలుగా వ్యవహరించారు. టాలీవుడ్ లో వీళ్లకిది తొలి సినిమా. ఆటగాళ్ళు మరింత జోరు చూపించి ఉంటే బాగుండేది.

రేటింగ్. 2/5

Next Story
Share it