Telugu Gateway
Cinema

‘విజేత’ సెన్సార్ పూర్తి

‘విజేత’ సెన్సార్ పూర్తి
X

చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తొలి సినిమా ‘విజేత’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికెట్ మంజూరు చేసింది. జూలై12న విజేత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన విజేత ట్రైలర్‌, సాంగ్స్‌ కు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో కళ్యాణ్ కు జోడీగా మాళవిక నాయర్‌ నటిస్తున్నారు. వారాహి సంస్థ నిర్మించిన ఈ సినిమాకు రాకేశ్‌ శశి దర్శకత్వం వహించారు. చిరంజీవి నటించిన సినిమానే విజేత. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకు కళ్యాణ్ తన తొలి సినిమాకు ఇదే టైటిల్ ను ఎంచుకున్నారు.

Next Story
Share it